Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹220

ముందుమాట

వ్యథార్ధ జీవిత యథార్థ ఘటనల దృశ్యమాలిక 'డ్యూటీ'

"తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది భూమి” అని మనందరికీ తెలుసు. విధి నిర్వహణలో భాగంగా ఈ భూమి చుట్టూ “బస్సెక్కి” తిరుగుతూ జీవితంలో సింహభాగాన్ని జనం మధ్యనే గడిపేవాళ్ళు బస్సు డ్రైవర్లు, కండక్టర్లూ,

బస్సంటే ఒక మినీ సమాజమే. రకరకాల జనాల సమూహమే. ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు. దిగేవాళ్ళు దిగుతుంటారు. వీళ్ళందరినీ మోసుకుంటూ గమ్యంవైపు దూసుకుపోతుంటుంది. బస్సు.

ఇలాంటి బస్సులో కస్సుబుస్సులు... కోపతాపాలు... ఘర్షణ దూషణలూ, మానవత్వపు ఆవిష్కరణలూ, మంచి చెడుల భావ ప్రభావాలూ అనునిత్యం సర్వసాధారణం. ఇలా కదిలే బస్సు గర్భంలోంచే కదిలించే ఈ కథ పుట్టుకొచ్చింది.

చైతన్యవంతుడైన, ప్రతిభాశీలి తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు అతడి చూపు కుదురుగా ఉండదు. తన ఊహలకు ఊపిరిపోస్తూ పాత్రలూ, సంఘటనలూ, సంఘర్షణలూ తన చుట్టూ తిరుగుతూ కదిలించినప్పుడు... రచయితకు ఇక ఊపిరాడదు. వాస్తవ ఘటనలనే వస్తువులుగా స్వీకరించి సామాజిక జీవన స్వరూపాన్ని ప్రతిబింబించే పాత్రల సృష్టితో అద్భుతమైన ఆవిష్కరణ చేస్తూ ఆలోచనలకు అక్షర రూపం ఇస్తాడు. ఆదిరెడ్డి 'మావుళ్ళు గారు అలాంటి రచయితే, తొమ్మిది జనరంజక నవలలు వెలువరించిన మావుళ్ళు గారు మామూలు రచయిత కాదు, ఒక సామాజిక ప్రయోజనాన్ని బలంగా ఆశిస్తూ బాధ్యతతో తన కలాన్ని కదిపే ప్రతిభాశాలి. - "పుస్తకానికున్న శక్తి అపారం... అది సమాజాన్ని చాపకింద నీరులా ప్రభావితం చేస్తుంది” అని విశ్వసించే ఈ రచయితకు “మన మనసులో కల్మషం కపటం లేని నాడు ఎప్పుడూ ఎవరికీ భయపడాల్సిన పని లేదు” అనే స్థిరమైన జీవన విధానం ఉంది. అది కన రచనలలో ప్రతిఫలిస్తుంటుంది..............