డ్రాకులా 1897 లో బ్రామ్ స్టోకర్ సృష్టించిన భయానక నవల. ఈ నవల తరువాత అనేక మంది రచయితలు ఇటువంటి రచనలు చేశారు. ఈ కథ లోని డ్రాకులా అనేక సంవత్సరాలనుండి అనేక దేశాలలో భయాందోళనలు సృష్టించిన రక్త పిశాచి. ఇతనికి అనేక విద్యలు తెలుసు. ఏదైనా జంతువు గానో, పక్షి గానో మారిపోగలడు. అతి చిన్న సూక్ష్మ రూపాన్ని, లేదా అతి పెద్ద పర్వతాకారాన్ని పొందగలడు. సముద్రంలో ఉప్పెన సృష్టించగలడు పొగ మంచులా మరగలడు. ఇతని భారిన పడిన వారు ఎవరైనా డ్రాకులా లా మారిపోతారు. అతనికి బానిసలైపోతారు. అలా ఎందరినో తన బానిసలుగా మార్చుకున్న డ్రాకులా ను కొందరు వ్యక్తులు ఎలా అంతం చేశారనేది ఈ నవల కథాంశం. అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తూ మనతో ఈ పుస్తకం చదివిస్తుంది అనడంలో సందేహం లేదు.