అనుమోలు రామకృష్ణ సుప్రసిద్దుడైన భారతీయ సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరు/ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. భారతదేశంలో అతిపెద్ద ఇంజినీరింగు, నిర్మాణంగా సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో సంస్థకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు. భారత నిర్మాణరంగా పరిశ్రమను ఆధునీకరించడంలో సృజనాత్మక వ్యవస్థలను, నిర్మాణ వ్యూహాలను ఆచరణలోకి తీసుకోని రావడంలో అయన కీలకపాత్ర పోషించాడు. తద్వారా భారతీయ నిర్మాణ పరిశ్రమ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకోని వచ్చాడు. అయన ఉత్సాహం, నిజాయితీ అయన కృషికి, ప్రజాసేవకు , కుటుంబానికి సమానంగా విస్తరించాయి. విజ్ఞానశాస్త్ర, ఇంజనీరింగు రంగాలలో అయన కృషికి భారత ప్రభుత్వం 2014 లో అయన మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారాలతో మూడవదైన పద్మభూషణ్ పురస్కారం అందజేసింది.