"దివ్యా చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమష్టి ప్రవృత్తులు పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కాళనురాగంతో రూపొందించించిన కాల్పనిక చిత్రం. అందులోనే యధార్థాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం.
మానవుని కంటే గొప్పది - అతని ఆత్మవిశ్వాసమే; అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికి, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కాళనురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.
- యశ్ పాల్