ఇది హాస్య నవల. గతంలో వెలువడ్డ "కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్. మిస్టర్ వీరియం, సుందరి సుబ్రావ్" కామెడీ నవలల్లా ఇది జోక్స్ తో కూర్చబడ్డ నవల. అక్కడక్కడ చదివితే దేవుడు, మతాలు, ఆలయాలు, ప్రవాచనాలు, తీర్ధయాత్రలు లాంటి దేవుడికి సంబంధించిన జోక్స్ బుక్ చదివినట్లుంటుంది. వరసగా చదివితే మిస్టర్ శఠగోపం జీవిత కథని చదువుతారు.
"డివైన్ కామెడీ" నవల కోసం ఆంధ్రుల అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వెయ్యికి పైగా ఇలాంటి జోక్స్ ని సేకరించి అందిస్తున్న నవల ఇది. మీరు నాస్తికులైనా లేదా ఆస్తికులైనా ఈ నవల మీకు తృప్తినిస్తుంది.