Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

               రచయితగా, సంపాదకునిగా ప్రచురణకర్తగా ప్రత్యేకించి కథకునిగా శ్రీ ధనికొండ హనుమంతరావు గారిది ఓ విశిష్టమైన వ్యక్తిత్వం. ఎవరు సహాసించని పని చేయడమన్నా, ఎవరు స్పృశించని సాహితి కోణాన్నీ స్పృశించడమన్న ఆయనకి తగని మక్కువని వారి రచనలను అధ్యయనం చేసినవారికి తేలిగ్గా అర్ధం అవుతుంది.

                  ఇప్పుడు నేను వ్రాస్తున్న విషయం శ్రీ ధనికొండ హనుమంతరావు గారి సంపాదకత్వంలో వెలువడిన "సచిత్ర విచిత్ర మాసపత్రిక అభిసారిక" గురించి . ఈ పత్రిక వెలువడింది తెనాలినించి. పత్రికలు ప్రభవించి పుష్పించింది ఆనాడు బందరు, తెనాలి, బెజవాడల్లోను, రాజమహేంద్రపురంలోను . 
                     ప్రధమా సంచిక వెలువడింది జులై 1949 లో. "శృంగారం"అనే పదం ఒకప్పుడు నిషిద్ధం. అయితే కావ్యాల విషయంలో వేరు. సామాన్య మానవుడు ఆ పదాన్ని వాడితే "బూతు" అని నిర్ద్వందంగా పరిగణించేవారు. చలాన్ని, కొవ్వలిని కూడా విమర్శించే రోజుల్లో, ఓ శృంగార "మాసపత్రికను" ప్రారంభించాలంటే ఎంత గుండెధైర్యం కావలి?