ఆనాడు చైత్ర పౌర్ణమి! నేలపై మీగడ తరకలు పరిచినట్టు భ్రమ కలుగుతున్నది. యెక్కడ చూసినా ఉత్సాహంతో ఉరకలు వేసే యువతీ యువకులు కన్పించారు పాటలీపుత్ర నగరమందు .
శాక్యులు, నందులు, మౌర్యులు, శాతవాహనులు, కదంబుల శక్తివంతమైన అర్ధవంతమైన పరిపాలనా ఆంతరించిన పిమ్మట, రాజులు, అసమర్ధులు పాలనా దక్షత లేక, అటు యెక్కి, ఇటు గద్దెదిగారు. అరాచకం ప్రబలింది. బౌద్ధమత ప్రచారం ముమ్మరంగా సాగింది. హిందూ మతం క్షణదశలో ఉన్న తరుణమున మగధ సామ్రాజ్యము గుప్తరాజులు ఆధీనంలోకి వచ్చింది.
సముద్రగుప్త మహారాజు పరిపాలన అది. క్రీస్తు మరణానంతరము మూడు, నాల్గు వందల మధ్య కాలమది. సముద్రగుప్తుడు దయాసముద్రడుని పేరు గాంచాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.