Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
2017, డిశంబరు మొదటి వారంలో నేను మొరాకా దేశంలోని రబాత్ పట్టణంలో కవుల సమావేశంలో పాల్గొన్నాను. అకుడ మేం ఉన్న హాటంలో గా అనేకమంది కవులతో పరిచయం ఏర్పడింది. బహ్రయిన్, బ్రునె, ఇరాక్, లెబనాన్, - ఇటలీ, పోలండ్, ఇంకా అనేక దేశాల్నుంచి వచ్చిన కవులు చాలా సందడిసందడిగా తిరిగారు. ఆ కవిత్వ పరిమళాల మధ్య నా ధోరణిలో నేను అందరితో కలివిడిగా, నవ్వుతూ తుళ్లుతూ ఉన్నాను. మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచాయి. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోతున్నపుడు రిసెప్షనిష్టు ఓ అందమైన యువతి నా దగ్గరకు వచ్చి 'నీతో 'సెల్ఫీ' కావాలి' అన్నది. సెల్ఫీలు దిగాక ఇద్దరం Email అడ్రన్లు ఇచ్చిపుచ్చుకున్నాం Face Book మెసెంజర్ల నెంబర్లనూ. 1 ఇండియా వచ్చాక ఆమె విజిటింగ్ కార్డు కనిపించింది పర్సులో. ఫేస్ బుక్ లో ఆమె ఫ్రెండ్ షిపను OK చేసాక అర్థమయ్యింది, మొరాకోలో నాకు పరిచయమైన అనేక కవుల, కవయిత్రుల స్థాయిని మించిన కవిత్వం ఆమె వ్రాస్తున్నదని నా | ఆశ్చర్యానికి అంతులేదు. ఈ సంవత్సరమల్లా ఆమె కవిత్వాన్ని చదివి అర్థం | చేసుకున్నాను. అరబిక్ భాషలోని ఆమె కవితలను యూసుఫ్ ఎలా ఇంగ్లీషులోకి అనువాదం చేసినాడు. వాటిని నేను తెలుగులోకి అనువదించి తెలుగుసాహితీలోకానికి కానుకగా అందిస్తున్నాను. మేఘావృతమైన ఆకొని మెరుపుతీగెల్లాంటి ఆమె కవిత్వాన్ని అందరూ ఆనందిస్తారని ఆశిస్తూ....
-డాక్టర్ లంకా శివరామప్రసాద్