Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

వ్రాత దీక్ష నియమాలు

1 . ప్రతి దినము , ప్రాతః కాలమున , సంధ్య సమయమున చన్నీటి శిరః స్నానమాచరించి, విభూతి, గంధము, కుంకుమతో నుదుట బొట్టు ధరించవలయును. బొట్టులేక అయ్యప్పలెప్పుడు యుండకూడదు.

2 . స్వామిని రెండు పూటలా విధిగా శక్తి కొలది సేవించిన తదుపరి ఆహార పానీయములు సేవించవలెను.

3 . నూనోవాక్కాయ కర్మలయందు కఠోర బ్రహ్మచర్యము పాటించవలయును.

4 . స్త్రీలను ఋతుకాలమునందు చూచుటయను, మాట్లాడుటయను కూడదు. తెలిసో తెలియకో అట్లగుటయైన వెంటనే చల్లటి నీటితో శిరః స్నానమాచరించి, కర్పూర జ్యోతి వెలిగించి. శరణు గోషా చేయవలెను. మాలకు హారతి తీసుకొనవలెను.

5 . గోళ్ళు, కోరుకుట, తీయుట పనికిరాదు పాదరక్షలు ధరించరాదు. క్షురకర్మ పనికిరాదు.