Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
దళితుల భౌతికవాద విజ్ఞానం దళిత తత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌ న్యాయం కోరే సమతావాదం దళిత తత్వం. ఈ దళిత తత్వాన్ని రూపకలను ఆలోచన 2004లో కలిగింది. దళిత కార్యకర్తలకు బోధనా తరగతులను వివిదం నిర్వహిస్తున్నపుడు వారు ఈ ఆలోచనలు ఒక పుస్తక రూపంలో వుంటే బాగుం పలుసార్లు మా దృష్టికి తెచ్చారు. లిఖిత పూర్వకంగా ఒక ఆలోచనను రూపకల్పన చేసిన అందులో వుండే సాధక బాధకాలు అనేకం. అందుకే 2005 సంవత్సరమంతా దట తత్వం రూపకల్పనకు ప్రాముఖ్యతనిచ్చి, ఈ గ్రంధంలోని అంశాలను ఐదు రోజుల శిక్షణ తరగతులుగా మలచి దాదాపు 5000కు పైగా కార్యకర్తలకు బోధన నిర్వహించాము. వారి స్పందన గమనించి ఈ గ్రంధాన్ని ఒక టెక్స్ట్ బులా రూపకల్పన చేశాము. ఇది 2000 కోట్ల సంవత్సరాల పరిణామక్రమాన్ని, దళితుల చరిత్రను, తత్త్వాన్ని, పోరాటాన్ని సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా ప్రతిఫలించే గ్రంధం. ఈ గ్రంధం చదివిన తరువాత మరింత విస్తృత అధ్యయనానికి పూనుకుని సమసమాజ స్థాపనకు ఆచరణాత్మక కృషి చేయాలన్న
భావన కార్యకర్తలలో కలిగితే మా కృషి సఫలమైనట్లే భావిస్తాము. మూడు వందల పేజీల పరిమితిలో చెప్పాల్సిన విషయాలన్నింటినీ చెప్పవలసి రావడం ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఇందులోని ప్రతి ఒక్క తరగతి పాఠం మరలా ఒక్కో పెద్ద గ్రంధం కాగల విశాలత కలిగినది. ఏ తరగతి కూడా 30 పేజీలు మించకుండా, అదే సమయంలో విషయాన్ని వదిలివేయకుండా, చదివించేలా రాయడం కత్తిమీద సాములాంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని రచయితలు సమర్థంగా నిర్వహించారు. అందుకు ముందుగా వారికి మా అభినందనలు, అనేక విశ్లేషణలకు స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ సిద్ధాంతానికి మా జై భములు
కేవలం దళిత కార్యకర్తల శిక్షణను దృష్టిలో వుంచుకొని రచించినా, - సమతావాదాన్ని కోరే మంచి మనసున్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గ్రంధం. . 2 గ్రంధాన్ని చదివి తప్పొప్పులను, లోటుపాట్లను తెలిపితే మలి ముద్రణ మరింత శక్తి తీర్చిదిద్దుకునే అవకాశం మాకు లభిస్తుంది. ఇంకా విస్తృత ఆలోచనను కూడా చేత వీలూ లభిస్తుంది.
దుర్గం సుబ్బారావు
పందిరి అంజయం
కొమ్ముపాలెంశ్రీనివా