ఈ పుస్తకంలో ఓ మనిషి దేవుడికి చేసిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులని మీరు చదవచ్చు. ఐతే నాకు దేవుడితో పరిచయం ఉండి ఆయన చెప్పిన సమాధానాలు కావివి.
ఇది దేవుడితో ఊహాత్మక సంభాషణ మాత్రమే సుమా!
జీవితానికి ఉపకరించే లేదా ఆలోచింప చేసే ఎన్నో ప్రశ్నలకి లౌకిక, ఆధ్యాత్మిక, సామాజిక, కొండొకచో వ్యంగ్య సమాధానాల సమాహారమే ఈ దైవంతో సంభాషణం.
కొన్ని సమాధానాలు నర్మగర్భంగా ఉండి లోతుగా ఆలోచిస్తే కాని అర్థం కావు. దేవుడు హాస్య ప్రియుడు. కాబట్టి కొన్ని సమాధానాలు టంగ్ - ఇన్ - చీక్ హాస్యోక్తులు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి