సైబర్ భద్రత - డేటా పరిరక్షణ - పోలీస్ పాత్ర అన్న విషయాన్నీ విశదీకరించడం కోసం, ముందుగా కంప్యూటరు ప్రాధిమికాలు అంటే ఏమిటో, ఒక చక్కని సకారాత్మక మైన అవగాహనా కలగడం కోసం, 1985 లో ఈ రచయిత రాసిన పుస్తకాన్ని పునర్ముద్రితం చేయడం జరిగింది.
ఈ కంప్యూటర్ మీద అవగాహనా వచ్చిన తర్వాత, సైబర్ నేరాలు, మోసాలు, ఎలా జరుగుతున్నాయి, వాటిని గుర్తించడం ఎలా, వాటిని నిరోధించడం ఎలా, వాటిని పరిష్కరించడం ఎలా, వంటి వివిధ అంశాల మీద వివరించడం జరిగింది. మనం నిత్య జీవితంలో వాడే కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు వగైరా కొత్త కొత్త గాడ్జెట్లు ఎలా పని చేస్తాయి. వాటి వాడకంలో జాగ్రత్తలు కొంచెం వివరించబడ్డాయి.
సోషల్ మీడియా దాని సత్ ప్రభావము/దృష్ర్ప భావము వంటివి కూలంకషంగా చర్చిండం అయ్యింది . ముఖ్యంగా టివిలు, మొబైల్ లు, పిల్లలు, యువత, వీడియో గేమ్స్, కష్టా నష్టాలు, ఇబ్బందులు, ప్రమాదాలు,తల్లిదండ్రుల పాత్ర, చాలా విపులంగా రాయడం జరిగింది.