మానవుడు జంతువులా నాలుగు కాళ్ల మీద నడిచేటప్పుడు మిగతా జంతువుల జీవన విధానానికి ఏమి భిన్నంగా జీవించలేదు. మార్పు ప్రపంచ సహజ తత్వం. దీనికి మానవుడు అతీతం కాదు.
మానవుడు నిలబడటం అలవాటు చేసుకొని రెండు కాళ్ళు , రెండు చేతులు వాడటం మొదలు పెట్టడం అదే మొదటి ఆధునీకరించబడటానికి దారి తీసిన పరిణామము. ముందర కాళ్ళను చేతులుగా మార్చుకోవడం ఎంతో విప్లవాత్మకమైన మార్పు. అది మిగతా జీవులను అధిగమించి వాటిని నియంత్రించే స్థితికి మార్పు చెందాడు. మానవ జాతిని మిగతా జంతుజాలం నుండి వేరుచేసి జాతిని ముందుకు నడపడానికి ఉపయోగపడింది.