సాధారణంగా సినీ పండితులలో కమర్షియల్ సినిమాలంటే చిన్న చూపు ఉంది. భారతీయ సినిమాలకు పరాయివాళ్లే కాదు మన విమర్శకులు కూడా పాటలు - నృత్యాల సినిమాలని చులకనగా భావిస్తారు. దేశంలో ప్రజలంతా అభిమానించే సినిమాలను "పల్ప్" సినిమాలుగా కొట్టేస్తారు. ఆనందించే పాటలను "చౌచౌ" పాటలుగా తీసిపారేస్తారు. ఆరాధించే నటీనటులు కమర్షియల్ నటులని పట్టించుకోరు. కానీ విమర్శకులు మెచ్చి ఆకాశానికి ఎత్తే సినిమాలకన్నా వారు తేలికగా కొట్టేసే సినిమాలే సమాజం పై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేసి వారి ఆలోచనా ధోరణిని నిర్దేశిస్తున్నాయి. ప్రజలు నిక్కచ్చి అయినా విమర్శకులు.