Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                        "ఐ.ఎ.ఎస్. అధికారి కావడం చాలా కష్టమే కానీ, ఐ.ఎ.ఎస్. అధికారిగా ప్రజల కలెక్టర్ కావడం ఇంకా కష్టం. కష్టమైనా     ఇష్టపడి పనిచేయడంలోనే విజయ రహస్యం దాగుంది” అని అంటున్న శ్రీమతి కె. రత్నప్రభ 1981 బ్యాచ్ కి చెందిన ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. ఆమెది కర్నాటక క్యాడర్. 2018లో కర్నాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. పదవీ విరమణ తరువాత ఆమె 'కర్నాటక రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. 1990-95 మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు, బీదర్జిల్లాలలో కలెక్టర్‌గా పనిచేసి ప్రజా కలెక్టరమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరును ప్రశంసిస్తూ ఎన్నో అవార్డులు యిచ్చారు.

                         ఇటీవలే గౌ॥ శ్రీ నరేంద్ర మోదీగారు కూడా దేశ స్థాయి జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ 'జిల్లా కలెక్టరుగా పనిచేయడమంటే రత్నప్రభగారిలాగా పని చేయడమనీ, ఆమెశ్రీమతి రత్న ప్రసరించదగినదని” ప్రశంసింత ప్రభగారిలాగా పని చేయ సమావేశంలో పాదించు . "భారతదేశం తన అనుభవాలు ఆమె సులయిన బీదర్ సంక్  శ్రీమతి రత్నప్రభ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. క్రీడలు, నిరంతర ప్రజాసేవ ఆమె అభిరుచులు.

                          తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్‌గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. "భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానికి సులభ సూత్రాలను అందించడం; ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడమెలానో జీవన మార్గదర్శనం చేయడం.”

                           శ్రీమతి రత్నప్రభ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే! హైదరాబాదులో పుట్టి పెరిగిన ఆమె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ, ఐ.టి., రవాణా శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఆమె తెలుగు చిత్రాల తొలి సెన్సార్ ఆఫీసర్‌గా పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్రాసు నుంచి హైదరాబాద్ కి తరలిరావటానికి ఆమె చేసిన కృషిని ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు గౌరవంగా గుర్తుంచుకుంటారు. VSEZ తొలి డెవలప్మెంట్ కమిషనర్‌గా పిచ్చి తుప్పలతో నిండి ఏ పరిశ్రమా లేని దశ నుండి 5 ఏళ్ళలో 9000 కోట్ల రూపాయల ఎగుమతులు చేసే స్థాయికి భవాలు' ఆమె తొలి రచన. ఇంగ్లీషు, కన్నడలో ఇప్పటికే  Bఊదరణ పొందింది. తెలుగు పాఠకులు కూడా ఈ పుస్తకాన్ని ఆదరిసారని నమ్ముతున్నాం.                                                                                                                                                                                                                                                                                                                                  Ratnaprabha, IAS