Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మనసు మీటిన "చిత్రవీణ"
ఉరుదూ ముషాయిరాల్లో కొందరు గజలను “తరన్నుమ్” (రాగయుక్తం) గానూ, మరికొందరు "తహెత్” (రాగం లేకుండా) గానూ వినిపిస్తారు.
గజల్ ప్రధానంగా గాన ప్రక్రియకు చెందినదే అయిననూ, ఎవరికి వారు రాగరహితంగానూ చదువుకుని ఆనందించవచ్చును. దేని సౌందర్యం దానిదే.
హైదరాబాద్కు చెందిన ఉస్తాద్ (నజీర్ అలీ ఆదిల్ గారు)... తన గజళ్ళను తహెత్ (రాగంలేకుండా) గా వినిపించేవారు. అప్పట్లో వారి ముషాయిరాలకూ జనం కోకొల్లలుగా ఉపస్థితి అయ్యేవారు. అమితంగా ఆనందించేవారు కూడా..
ఇప్పుడిది ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందీ అంటే, కవయిత్రి విజయ గోలి గారి "చిత్రవీణ” గజళ్ళలో అటు “తరున్నుమ్” లోనూ, ఇటు “తహెత్"లోనూ ఎలా వినిపించిననూ శ్రోతల హృదయాలను అకట్టుకోగలిగే గజళ్ళు పుష్కలంగా వున్నాయని చెప్పడానికే. ఈ క్రింది గజలను చదవండి
“మనసెందుకు గమ్మత్తుగ గగనవీథి తేలుతుంది ! ఏమైనదో తెలియకుంది ఎద చప్పుడు పెరుగుతుంది ! కనుపాపల లాలిపాడ కరుణించదు నిదుర తల్లి కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది ! నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది !