Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భౌభౌభౌ...!
అతగాడు అల్లంత దూరం వెళిపోయేడు. ఇసుకలో కన్పించే అతని పాదముద్రలు మీద ఉమ్మివేస్తూ -
...గండడా, నా గాజుల చేతుల్తోటి నీకు గుండం కటకపోతే నా పేరు గౌరీశం అదు..." అని మొటిమలు విరిచి శపధం చేసింది. సామంతుల గౌరీశ్వరి. ఆరే బీచ్ గాలికి ముంగురులు చెదిరి మొహమ్మీదపడి చీకాకు పెడుతుండగా ముంగురుల్ని కొప్పులోకి దూర్చి గాలివాటం వేపు కోపంగా చూసింది. ఏయూ క్వార్టర్సులోంచి వొస్తున్నపుడు యే నిద్రగన్నేరు పువ్వెగిరిపడిందో - జాకెట్ లోపల వీపుమీద కదలాడుతూ చేతికి అందక చికాకు పెడుతోంది. ప్లాస్టిక్ కవర్లూ, పారేసిన వాటర్ పేకెట్లూ, చిన్నచిన్న అట్టముక్కలు
యేరడానికి పట్టుకున్న ఇనుప కొక్కేముతో ఓ చిన్నపాటి అట్టముండని పొడిస్తే యెంతకీ దిగదూ! కసిదీరా పొడవగా అట్టముండ యిసకలో దిగబడిపోయింది. చిరాకెత్తింది ! గౌరీశ్వరికి! గౌరీశ్వరి చికాకులన్నీ చూసి గండర గండడిలాగ నవ్వేడతను. సిగ్గులేని
మొకానికి నవ్వే సింగారం - అనన్నది గౌరీశ్వరి. గండడు మళ్లీ కేళీవిలాసంగా నవ్వేడు. కెరటాలు మళ్లిన తర్వాత సముద్రంలో రాళ్లు బయటకి కనబడినట్టు నవ్వినపుడు అతగాని పళ్లవరస కనబడింది. అతను వెనక్కితిరిగి గౌరీశ్వరివేపు నడిచేడు. అతని దగ్గిట ఓ కుక్క వుంది! అది ఆ గండడి నడుమెత్తుంటాది. ఆడి బరువుకి సగం బరువుంతాది. ఆ కుక్క గూడా వెనక్కి తిరిగి కొంతదూరమొచ్చి - యిసుకను పావనం చేసింది! గౌరీశ్వరి వెంట కూడా ఒక బేసి వుంది! అదా కుక్క చుట్టూ తోకాడించుకు తిరిగింది. ఆ కుక్క గర్వంగా బేడివేపు చూడసాగింది. గౌరీశ్వరికి కోప మొచ్చి బేపి మీదకి కొక్కేన్ని విసిరింది. బేపి గుణుసుకుంటూ గౌరీశ్వరి దగ్గరకు వచ్చేసింది!
"...ఆటి ఉసురు పోసుకోకు..." అనన్నాడు. గండడు కిలాడీగా నవ్వుతూ. ... సిత్తకార్తి బేపి......." అని ఈసడించి అక్కడ్నించి నడిచింది. గౌరీశ్వరి! రేపిదే
యేళకి,యిదే అల వరసల మళ్లీ కలద్దారి! టాటా, బైబై - అని చేయి ఊపేడు గండడు. మళ్లీ గౌరీశ్వరి - గాజుల చేతుల్తోటి గండడికి గుండం కడతానని శపధం చేసింది. కొంతదూరం వెళి, వెనక్కి చూసి గండడు కనుమరుగయినాక - నీ బుద్ధి పోనిచ్చుకున్నావు ! గాదని తన వెంటనున్న బేపిని కోప్పడింది. బేటి పశ్చాత్తాపపడుతూ - అదేటోగాని , కుక్క అవుపడితే నన్ను నీను మరిచిపోతన్నానంది! ఆ గండదు కూడా - అదేటోగానీ, | నువ్వు కనబడితే నన్ను నీను మరిచిపోతాను. నువ్వు కనబడకపోతే మనిసిని.............