Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కాన్ సెర్డినా (Concertina) అనేది ఓ సంగీత పరికరం. Accordi. ons, harmonica లా ఇది గాలిని నియంత్రించడం వలన చక్కని ధ్వనులను పుట్టిస్తుంది. గాలి తిత్తులు, బటన్లతో ఉండి రెండు చేతులూ వాడాల్సి వస్తుంది. ఇంగ్లండ్, జర్మనీలలో రూపొందించబడిన ఈ సంగీత పరికరం ఐర్లండ్, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికాలలో, టాంగో, పొల్కా సంగీతంలో విరివిగా ప్రాచుర్యంలో ఉన్నది.
ఈ 'కాన్ సెర్టినా'ను Ade Caparas Manilah స్వాప్నికురాలు, కవయిత్రిగా, తనకు చిహ్నంగా; చిరుగాలిని ప్రేమికుడు, కవిగా భావించుకుని వారిద్దరి కలయికను శృంగారపరంగా అద్భుతంగా వర్ణించింది. స్వతహాగా Interior Designer కావడంతో ఆమెలోని కళాభిజ్ఞత ఈ కవితలలోని వాక్యా లలో ప్రస్పుటంగా కానవస్తుంది. కవిత్వమనేది పాఠకుడి దేహం, మనస్సు, ఆత్మలలో ముద్రవేసి కలవరం కలిగించాలంటుంది Ade Caparas Manilah (Ade C.).
వివిధ దేశాల కవుల, కవయిత్రుల కవిత్వాన్ని తెలుగు పాఠకులకు అనువదించి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా వెలువడుతున్న - చిరుగాలి నా ప్రేమికుడు The wind my lover - ద్విభాషా కవిత్వాన్ని తెలుగు సాహితీలోకం: ప్రేమతో ఆదరిస్తుందని విశ్వసిస్తూ........
- డాక్టర్ లంకా శివరామప్రసాద్,