సీమ భాషలో... అనంతపురం మాండలికంలో...ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని... అక్షర్ రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. "వినుగు" కావడమే కాక, సీమ భావితరాలకు ఒక "పద్మనాభుని నిధి" లా మిగులుతూ.. కొలమానాల కందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ కథాసంగ్రహాలు "ఆరుగ్లాసులు", "ఏకాకి నొక చప్పుడు ", నవలసంగ్రహాలు "పంచమం ", "చీకటి పూలు" సీమకే గర్వకారణం.