బ్రహ్మ శ్రీ అందుకూరి చినపున్నయ్య శాస్త్రి మహుదయులు జ్ఞాన వృద్దులు. సంగీత విద్వన్మణి. సాహితి ప్రియులు. ఏమాత్రము అహంకారము, గర్వము లేని నిర్మల మైన సున్నిత హృదయాలు.
వీరు బేంకు ఉద్యోగిగా చాల కాలము పని చేసిరి. తన వృత్తితో ఏమాత్రము సంబంధము లేని సంగీత సాహిత్యములు వీరిని ఆశ్రయించుట సంగీత విద్వాంసులకు సాహిత్యవేత్తలకు ఆశ్చర్యము కలిగించక మానదు. వీరు డబ్బదియారు వర్షములు ప్రాయమువారైనప్పటికీ వీరి శారీరక మానసిక పాటవము పదకొండేళ్ళకు కొంచెము తక్కువ వానిగా మనకు గోచరించు చుండెననిన ఆ అగస్త్యేశ్వరుని కృప ఎంత అపారముగా వీరికున్నడో గ్రహింప గలము.
వీరికి వేద వెదాంగముల లోతులు బాగుగా అవగతమగుట మనకంతుపట్టని రహస్యము. ఏ విషయము ప్రస్తావించినను ఆ విషయమునకు వేదాదులనుండి గ్రహించి అంశములతో సప్రమాణికముగా బుజువు చేయుచు వివరించుదురన్న విషయమునకు అనేక పత్రికలలో ప్రచురింపబడిన విరి వ్యాసములే ప్రమాణము.
-అందుకూరి చిన్న పున్నయ్య శాస్త్రి.