Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రయాణారంభాన్ని గుర్తుచేసే కథలు
చార్మినార్ కథలు' చదివి అభిప్రాయాన్ని తెలియజేయమని మిత్రుడు పరవస్తు లోకేశ్వర్ కోరినపుడు - అలనాటి హైదరాబాదు వాస్తవ్యులను అడిగితే బాగుంటుందని సూచించాను. సుమారు పదిహేనేళ్లుగా ఈ నగరంలో ఉంటున్నప్పటికీ - లోకేశ్ కథలలోని పాతనగరంతో నాకు పరిచయం లేకపోవడమే అందుకు కారణం. “అందుకేగా నిన్ను వ్రాయమన్నది! ఉత్తరాంధ్ర నుండి వెలువడ్డ సాహిత్యాన్ని మేం మనసారా ప్రేమించాం, ఆ ప్రాంతీయులు ఇక్కడి రచనలగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కూడా ముఖ్యం అనిపించింది," అన్నాడాయన. ఇక ప్రయత్నించక | తప్పలేదు.
బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ అతడి తల్లిగారు ఒక వేసవి మధ్యాహ్నపు మండుటెండలో కుతుబ్ షాహీ నవాబులు కట్టించిన రాచెర్వు (రాజుల చెరువు గట్టువెంట వట్టిపాదాలతో నడుస్తుండగా అటుగా పోతూన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు - హా. లోకేశ్వరా..... అంటూ చేసిన ఆక్రందన ఆధారంగా అతడి నామకరణం జరిగిపోయందంటే | నాకెంతో ఆశ్చర్యం కలిగిందిబీ సంబరం అనిపించింది. ఇదే ఈ సంకలనంలోని తొలి కథ. ఇందులోనూ, అలాగే మిగతా కథలు చాలా వాటిల్లోనూ - మార్మిక మాయాజాలం, వాస్తవ కాఠిన్యత కలగలిసిపోతాయి. పాఠకులకు రహస్య సంకేతాలను పంపి, బాల్యపు మధురానుభూతులలోకి లాక్కుపోతాయి.
అన్ని కథలనూ ప్రస్తావించడం సరికాదుగానీ కొన్నిటి గురించి చెప్పక తప్పదు. పాతనగరపు గల్లీలలో వికసించి ప్రవహించిన గంగాజమునా తెహజీబ్, చిన్ననాటి స్నేహాలు - వీటిని పోగొట్టుకోవడం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, ఒక సమాజపు దౌర్భాగ్యం. ఉర్దూ స్థానాన్ని తెలుగు మీడియం ఆక్రమించడం వెనుక చారిత్రక శక్తుల సంఘర్పణ ఉన్నదని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. బాలుడైన లోకేశునికి, పచ్చడా పచ్చదా నా...' కథలో తన చిన్ననాటి ముస్లిం దోస్తులంతా కాలం కలసిరాక చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్లిపోయిన వైనాన్ని గుర్తుచేసుకుంటాడు.