నేడు రైతాంగ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. వ్యవసాయం "దండగ" అనే స్థితి దాపురించి, రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణాలకు వలసపోవడంతో , వ్యవసాయరంగం మరింత సంక్షభంలో పడింది. దానికితోడు ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వం అన్నదాతలను కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు గురిచేసే చట్టాలు తేవడం గమనిస్తున్నాం. ఒకప్పుడు అత్యంత సంఘటితంగా, క్రియాశీలకంగా పనిచేసిన రైతు సంఘాలు, యితర ప్రజా సంఘాలతో పాటు నిరసపడ్డాయి.
వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు తిరిగి జవసత్వాలను పుంజుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న అవసరాన్ని గుర్తుచేయడానికే యీ గ్రంథ పునర్ముద్రణ.