Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
రామ్ విలాస్ శర్మ (10.10.1912 - 30.05.2000) ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా సానీ గ్రామంలో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఎ. మరియు డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. వృత్తి రీత్యా ఆంగ్ల ఆచార్యులు అయినప్పటికీ హిందీలో అభ్యదయ, ప్రగతిశీల విమర్శకులుగా ఖ్యాతి పొందారు. వేదాలను, మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేసి సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించే ప్రయత్నం చేసిన గొప్ప మేధావి. చరిత్రకారిడిగా, భాషా వేత్తగా, రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో ప్రసిద్ధులయ్యారు. తమ సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో వివిధ అంశాల మీద దాదాపు వంద పుస్తకాల వరకు రాశారు. పునరుజ్జీవన ఉద్యమాలు, వెనుకబడిన సమాజాలు మరియు మార్క్సిజం మీద రాసిన పుస్తకాలు పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆంగ్లేయులు రాసిన చరిత్రను వారు ఒక కుట్రగా భావిస్తారు. భాషా సాహిత్యాల పరంగానే కాకుండ తత్వ శాస్త్ర పరంగా కూడా భారతదేశం అత్యంత ప్రాచీన దేశం అని దృఢంగా నమ్మేవారు. ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయకుండ భారతదేశ చరిత్రను అర్థం చేసుకోలేమని అనేక సందర్భాలలో స్పష్టంగా చెప్పారు.