2013 లో సి.ఎస్.ఎన్. ఐ.బి.ఎన్. వారు భారతీయ చలనచిత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశంలో ఒక వోటింగ్ నిర్వహించి బాషా బేధం లేకుండా అత్యుత్తమమైన 100 చలనచిత్రాలను ఎంపిక చేసారు. ఆ జాబితాలో 34 చిత్రాలు దక్షిణ భారతీయ భాషలకు చెందినవి. ఈ చిత్రాలలోని విశేషాలు, విచిత్రాలను "సదర్న్ గ్లోరీ" అనే ఆంగ్ల పుస్తకంలో వేదాంతం శ్రీపతిశర్మ పొందుపరచారు . ఆకెళ్ళ శివప్రసాద్ తెలుగు అనువాదం ప్రస్తుతం మీ చేతులలో ఉంది.... ఈ జాబితాలో భారతీయులందరు అత్యుత్తమ చిత్రంగా "మాయాబజారు" ను ఎంచుకున్నట్లు మీకు తెలుసా? అలాగే యావత్ భారతదేశం అత్యుత్తమ నటుడుగా మన నటరత్న డా|| నందమూరి తారకరామారావుని ఎంచుకున్నట్లు కూడా మీకు తెలుసా? దక్షిణ భారతీయులైనందుకు గాని, తెలుగువారై జన్మించినందుకు గాని గర్విస్తూ ఈ "చరిత్ర" పుటలను తిరగేయండి.....