Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                             భారత- చైనా దేశాల మైత్రికి ప్రపంచంలోని ఏ యితర రెండు దేశాల మధ్య కూడా లేని విధంగా రెండు వేల సంవత్సరాల చరిత్ర వుంది। అయితే భారత పాలకులు అనుసరిస్తున్న అగ్ర రాజ్య అనుకూల, ప్రాంతీయ ఆధిపత్య విధానాల మూలంగా 1958 నుండి ఆ మైత్రికి తీవ్ర విఘాతం కలిగింది। పరస్పర అభివృద్ధికి   భారత - చైనా దేశాల మైత్రి ఎంతైనా అవసరం । ఈ రెండు దేశాలు కలిస్తే , అగ్ర రాజ్య ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచం లో   సుస్థిర శాంతి నెలకొల్పి, ఆసియా శతాబ్దిని సాధించే క్రమం వేగవంతమవుతుంది। ఆ విధంగా భారత - చైనా దేశాల మధ్యా మైత్రికి  జాతీయ ప్రాముఖ్యతతో పాటుగా అంతర్జాతీయ ప్రాధాన్యత కూడా వున్నది। భారత పాలకులు అనుసరిస్తున్న అమెరికా అగ్ర రాజ్య అనుకూల విధానాలకు వ్యతిరేకంగా భారత  - చైనా దేశాల మధ్య మైత్రి కోసం ఒక  బలమైన మైత్రి వుద్యమ నిర్మాణ  అవశ్యాకత నేడెంతైనా  వుంది। దానికోసం సరైన అవగాహనను అభివృద్ధి చేసుకోవడానికి ఈ సంకలనంలోని భాగంలోని వ్యాసాలు తోడ్పడతాయి।