ప్రాచీన భారతీయ జనజీవనంలో క్రీస్తుకు పూర్వం అరవశతాబ్దం ఒక ముఖ్యమైన ఘట్టం..... పాతుకుపోయిన వర్ణవ్యవస్థలో,అగ్రవర్ణాల ప్రాబల్యంలో, జంతుబలులు మొదలైన దురాచారాలతో జనసమావ్యం విసిగిపోయిఉన్న రోజులవి.... దానికితోడు సమాజంలో వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు మొదలైనవి అభివృద్ధిచెంది, నూతన చైతన్యం ఆవిర్భవింపచేశాయి. బానిసలలోకూడా అసంతుష్టి పొడసూపింది. చార్వాకులవంటి భౌతికవాదులు వైదిక మతం పై తిరుగుబాటు ప్రకటించారు. ఈ వైరుధ్యాల నడుమ, ఒక నూతన విశ్వాసం, ఒక నూతన జీవనవిద్యనంయొక్క ఆవశ్యకత ఏర్పడింది..... ఆదశలో గౌతమబుద్ధుడు తమసిద్దాంతాలతో ఆ చరిత్రకవాసరాన్ని తీర్చాడు. వేదప్రామాణ్యాన్ని ఎదిరించి, జంతుహింసను నిరసించి, వర్ణవ్యత్యాసాలను ఖండించి, నూతన హేతుదృష్టిని ప్రజలలో ప్రవేశపెట్టి, బుద్ధుడు ఒక మహత్తర సామజిక పరిణామాన్ని సాధించాడు.
-మన్నే శ్రీనివాసరావు.