Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                                    మనం ఒక అభిసారికను నీకు అలకరించుకోవటానికి ఏ పుష్పం ఇష్టపడతావు? మల్లెలా , జాజి, విరజాజుల, సంపెంగ, లేక పరిగతమా అని అడిగితే ఆమె తప్పకుండా విస్తుపోతుంది! ఎందుకంటే దేనికదే పుష్పరాజమని మీకు తెలియదా? ఈ ప్రశ్న అడగాలా? అన్ని కావాలంటుంది. ఎందుకంటే పుష్పసౌరభంలోని మధురిమ సువాసనాలలోని రసమాధుర్యాని పూర్తిగా చవిచూస్తానంటుంది .

                                   అలాగే ఒక జోతిష్య పండితుని, శ్రీ మల్లాది మని గారి కలం నుంచి జాలువారిన జోతిష్య పుస్తకాలు ఏది కావాలని మీరు అడిగితే ఆ పండితుడు కూడా తప్పకుండా విస్తుపోతాడు. ఎందుకంటే శ్రీ మణిగారిచే విరచితమయిన పుస్తకం దేనికదే గ్రంధరాజమని మీకు తెలియదా? ఈ ప్రశ్న అడగాలా? అయన వ్రాసిన జోతిష్య సుధ అనే జ్ఞానామృతాన్ని గ్రోలటానికి ఎన్ని సుధాబిందువులు కావాలని అడిగినట్లుంది. జోతిష్య జ్ఞానాన్ని పూర్తిగా అభ్యసించడానికి అయన వ్రాసిన అన్ని గ్రంధాలూ కావాలనే అంటారు.

                                     ఇది అక్షర సత్యం - ముమ్మాటికీ నిజం. అందుకే ఈ గ్రంధరాజాన్ని జోతిష్య పండితులoదరికి మేము మరొక నూతన కానుకగా సమర్పిస్తున్నాము.

                                                                                                      -పండిట్ మల్లాది మని.