Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

 బృహదారణ్యకోపనిషత్తు శతపథ బ్రాహ్మణములో అంతి మభాగ మనియు యాజ్ఞవల్క్య ఋషి ప్రోక్త మనియు తెలియబడుచున్నది. మాధ్యందిన శాఖ యనియు, కాణ్య శాఖ అనియు కొంచెము పాఠభేదముతో రెండు శాఖలుగా శతపథ బ్రాహ్మణము ప్రకటింపబడుచున్నది. 

             బృహదారణ్యకోపనిషత్తుకు కాణ్య శాఖతో సంబంధము గలదు. యజ్ఞ రహస్యము, బ్రహ్మ విద్య, ఉపాసనా రహస్యము ప్రధానాంశములుగా, అరణ్యములో నివసించి పఠన పఠనములు నియమ పూర్వకముగ జేయుటకు యోగ్యమైనది కావున 'ఆరణ్యక' మనియు, మహత్తర విషయములు బోధచేయుట వల్లను, తక్కిన ఉపనిషత్తుల కన్న ఆకృతియందు గొప్పదగుట వల్లను, ఇది బృహదారణ్యకోపనిషత్తు అనునామమున ప్రఖ్యాతముగ నున్నది యజుర్వేద సంబంధమైన యీ ఉపనిషత్తులో ఆరు అథ్యాయములున్నవి.

                                                               - ఈశ్వర వరాహ నరసింహం