Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

బ్రహ్మవిద్య

ఈ గ్రంథము యోగశాస్త్రానికి సంబంధించినది, ఇది ఒకనాడు రాజమండ్రిలో గొప్ప యోగాశ్రమముండేది. చాలావరకు యోగవిద్య గోదావరి జిల్లాలో ప్రాచుర్యం పొందింది. ఒకనాటి మహనీయుడు శ్రీయుతులు దుర్గా ప్రసాద్ గారు ఈ గ్రంథమును ప్రచురించారు. ఇంతకన్న వివరములు ఎక్కువ లేవు. దాదాపు 100 సం||రాల క్రిందట ప్రచురించిన ఈ గ్రంథం చాలా శిథిలావస్థలో లభించింది. ఇట్టి అనన్య సామాన్య వివరములు తెలిపిన ఆ మహామహులకు శిరసా అభివందనములు.

2)యోగము - సిద్ధులు అను గ్రంథము తిరుపతి దేవస్థానం వారు ప్రచురించి ప్రజల కందించిన 'వివరములు ఇందులో చూపబడినవి. TTD దేవస్థానం వారికి 'హృదయపూర్వక వందనములు.

ఇది కేవలం ప్రజలకు తెలియాలని వివరములు గ్రహించి మంచి సాధనతో శ్రీవేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని మాత్రమే మా అభిప్రాయం.

పురాతన "బ్రహ్మవిద్య” గ్రంథంలోని విషయాలకు, TTD దేవస్థానం వారు ప్రచురించిన యోగం - సిద్ధులు అను గ్రంధమునకు అవినాభావ సంబంధమున్నందున వాటిని జోడించి విశ్లేషించడమైనది.

పతంజలి యోగ సూత్రముల ప్రకారం చెప్పబడిన వివరములు గలవు. అసలు యోగశాస్త్రం అనబడే బ్రహ్మవిద్య సూర్యుని వల్ల కృష్ణునికి చెప్పబడినట్లు శ్రీకృష్ణులవారు భగవద్గీతలో చెప్పినారు. భగవద్గీత సారము మరియు పతంజలి యోగమునకు దగ్గర సంబంధమున్నది. పతంజలి సూత్రములు వాసు దేవ మనమునకు ప్రతీకలు. ఈ రెండు అవినాభావ సంబంధమున్నది..............