Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

            మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905-1963) - కథానికల రచనలో తమదే అయిన ముద్రవేసి జాతికథకుడు గా ఖ్యాతిగడించినవారు మల్లాది - రామకృష్ణశాస్త్రిగారు. చిన్నతనం నుంచీ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడంతో వివిధ భారతీయ భాషలు, అనేక పాశ్చాత్య భాషలు నేర్చుకొన్నారు. ఆ భాషల సాహిత్యాలతో సాన్నిహిత్యం పెంచుకొన్నారు. ఎన్నో శాస్త్రాలలో, లలితకళలలో ప్రావీణ్యం గడించారు. అందుకే ఆరుద్రగారు 'రామకృష్ణశాస్త్రిగారు దాపరికత తెలియనేరని జ్ఞాపకాల మిలియనేరు. కోరుకున్న విద్యల కోటికి పడగెత్తిన కోవిదుడు. జవసత్వాలున్న సాహిత్యాన్ని చదువుకున్నారు ప్రబంధాలు, జావళీలు, భావకవిత్వం, స్టేజీనాటకాలూ, ఇంగ్లీష్ సినిమాలు - అన్నిటిలోనూ ఉత్తమాభిరుచులు పెంచుకున్నారు. వేదాలలోని మొదటి బుక్కునుంచి ఈ నాటి బీట్నెక్కుల సరికొత్త బుక్కుదాకా అన్నీ వారు చదివినవే" అన్నారు. చెన్నపురికి తరలివచ్చిన రామకృష్ణశాస్త్రిగారు సినిమా సాహిత్యకారులుగా, సాహిత్య ప్రవక్తగా గౌరవం పొందారు.

                 పి.ఎస్. గోపాలకృష్ణ - తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలలో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన గోపాలకృష్ణ - తెలుగు కన్నడ భాషలలోని సామెతల తులనాత్మక అధ్యయనం' అనే అంశం గురించి పరిశోధన చేసి - మైసూరు విశ్వవిద్యాయం నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. వివిధ ప్రచురణ సంస్థల సంపాదకవర్గాలలో పనిచేశారు. మూడు దశాబ్దాలకు పైగా 'ఆకాశవాణి లో వివిధ పదవులు నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడెమీలో ప్రాంతీయ కార్యదర్శిగా, ఉపకార్యదర్శిగా పనిచేశారు. రేడియో కోసం వేయికిపైగా రచనలు చేశారు. సినిమా డబ్బింగ్లో సహా అనువాదాలు చేశారు.