Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
గాంధీయిజానికి కాలం చెల్లిందా?
మహాత్మాగాంధీ గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకోవడం, క్రమం తప్పకుండా, మొక్కుబడిగానైనా జన్మదినాన్ని జరుపుకోవడం, చర్వితచర్వణ మవుతుందా? గాంధీ మరణించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా, ఆయనపై అసంఖ్యాకంగా వ్యాసాలు, గ్రంథాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, అంచనాలు
వెలువడుతూనే వున్నాయి. ప్రపంచ నాయకుల్లో ఏ కొద్దిమందినో మినహాయిస్తే, గాంధీ సిద్ధాంతాలు, ఆచరణ, ప్రయోగాలు గూర్చిన విశ్లేషణలు మరెవరిపైనా జరగలేదేమో! గాంధీ రచనలు దాదాపు నూరు సంపుటాల్లో వెలువరించడం యీ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
గాంధీ నూతన సిద్ధాంతాలను ప్రవచించిన సిద్ధాంతవేత్త కాదు. ఆయన విశ్వసించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక భావజాలమంతా 'Hind Swaraj అనే గ్రంథంలో వుంది. దక్షిణాఫ్రికాలో ఉద్యమాలు నిర్వహిస్తున్న జీవిత తొలిదశలో రాసిన గ్రంథం యిది. గాంధీ 'ఆత్మకథ' (My Experiments | with truth) సరళమైన శైలిలో, నిష్కర్షగా, దాపరికం లేకుండా, యెంతో తెగువతో రాసుకొన్నది. లక్షల కాపీలు అమ్ముడుపోయిన యీ గ్రంథాన్ని చదవడం అపురూపమైన అనుభవం. ఎంతటివారినయినా పునీతుణ్ణి చేయగల రచన. గాంధీని అర్థం చేసుకోవడానికి యీ గ్రంథాన్ని తప్పకుండా చదవాలి.
గాంధీజీ వ్యక్తిత్వానికి యెనలేని బలం చేకూర్చి, ఆత్మస్టెర్యాన్ని కలిగించిన ప్రధానాంశం నైతికశక్తి. రవి అస్తమించని, అత్యంత శక్తిమంతమైన ఆంగ్ల సామ్రాజ్యాన్ని కొల్లాయి గట్టిన, కర్ర వూతంతో నడిచిన, బోసినోటి బాపూజీ !.............