చిరపురాతనం... నిత్యనూతనం
కణువు కణువుకి పెరిగే తీపి మన సాహిత్యం. అది మాటలకందని అద్భుతం. వేదం నుంచి విశ్వనాథ వరకూ మన విజ్ఞానం ఒక అమృతభాండం . ఆచారాలు, సంప్రదాయాలుగా పరిరక్షించుకుంటూ వస్తున్న మన వారసత్వ సంపద. సనాతన సాహిత్యంలోని మర్మాలను వెలికితీసిన ఈ "భక్తి మకరందం" నేటి మానవుడి రేపటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక సాహిత్యంశాలను హృదయాలకు హత్తుకునేలా చెబుతుంది. మన జీవితంలో విడదీయరాని భాగమవుతుంది .