ఎదో ఒక రోజున మనమంతా స్వేచ్ఛ జీవులమవుతాం.
ఈ దేశంలోని నెల, పైన ఆకాశం మనదవుతుంది .
ఒకప్పుడు త్యాగమూర్తుల చితిలో కలిసిన ప్రదేశాల్లో
జనం సమావేశమై తమ దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ప్రస్తుతిస్తారు.
-పంజాబీ దేశభక్తి గీతం.
మేం జీవితాన్ని ప్రేమిస్తాం
మరణాన్ని ప్రేమిస్తాం
మేం మరణించి
ఎర్ర పూల వనంలో
పూలై పూస్తాం
నిప్పు రవ్వల మీద నిదురిస్తాం.
-భగత్ సింగ్.