Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                           ఓలేటి శ్రీనివాసభాను 1953, మే 6న పార్వతీపురంలోని బెలగాంలో జన్మించారు. పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నాలలో చదివి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.కాం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌గా పనిచేశారు. చిన్ననాటి నుంచి వివిధ సాహిత్య ప్రక్రియల పట్ల మమకారం పెంచుకున్న శ్రీనివాసభాను పదిహేనో యేటనే కథలు రాయటం ప్రారంభించారు. వివిధ వార, మాస పత్రికల్లో వీరు రాసిన కథలూ, కవితలూ, వ్యాసాలూ వెలువడ్డాయి. బహుమతులు పొందాయి. ఆంధ్రజ్యోతి ఆదివారం, ఈనాడు ఆదివారం, ఆంధ్రభూమి ఆదివారం, ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ, సితార, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలకు ఫ్రీలాన్సర్‌గా అనేక శీర్షికలూ, 'వ్యాసాలూ, ఫీచర్లూ, ముఖచిత్ర కథనాలూ, దారావాహికలూ రాశారు. ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన 'ఇది కథ కాదు' శీర్షికను 'తేజస్వి' కలం పేరుతో దశాబ్దం పైగా నిర్వహించారు. వివిధ టీవీ చానల్స్ కోసం రచనలు చేశారు. నృత్య రూపకాల్ని రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్, ఈటీవీ, జీ తెలుగు లలో భాను రచనలు ప్రసారమయ్యాయి. ఇంగ్లిష్, హిందీ, కన్నడ ధారావాహిక లకు డబ్బింగ్ రచన చేశారు. ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో పాఠకాదరణ పొందిన వీరి 'పొగబండి కథలు' పుస్తకరూపం సంతరించుకుని 'తురగా కృష్ణమోహన్ రావు పురస్కారం-2010' అందుకుంది. అదే పత్రికలో వెలువడ్డ 'వెండితెర వరప్రసాదం-ఎల్వీ ప్రసాద్', 'కలకండ పలుకులు శ్రీసాయి కథలు', 'చేతవెన్న ముద్ద' పుస్తకాలుగా వెలువడ్డాయి. 'బెలగాం కథలు' ఇప్పుడు సంకలనంగా వెలువడుతోంది. అలాగే నవ్య వీక్లీలో వెలువడ్డ 'అనురాగమూర్తులు-పుల్లయ్య, శాంతకుమారి' ధారావాహిక త్వరలో పుస్తక రూపంలో వెలువడనున్నది. ఇవే కాక, వీరి అనువాద రచన 'కల నిజమైతే' (ఆంగ్ల మూలం- డాక్టర్ అంజిరెడ్డి గారి ఆత్మకథ 'మై అన్-ఫిని, అజెండా'), 'ముకుందమాల' ప్రచురిత మయ్యా యి. 'అంతరంగం' (కథల సంపుటి), '20 చదరపు అడుగుల్లో... (బాక్సింగ్ గురువు ఈమని చిరంజీవి జీవిత చరిత్ర) ముద్రితం కానున్నాయి.