"హలో..." అన్నారు ఫోన్ యెత్తి. నవల మంచి రసపట్టులో ఉంది. "హలో అర్చన! నేను శ్రీధర్ని. నువ్వు వెంటనే ట్యాంకుబండ్ కు వచ్చేయి. నీతో అర్జoటు గా మాట్లాడాలి" అన్నాడు బావ.
నాకు నవ్వు వచ్చింది.
"మరో పెళ్లి చూపుల తంతా బావా? " అన్నాను నవ్వుతు.
"అలాగే అనుకో. వెంటనే వచ్చేయి. శైలుకు చెప్పవలసిన అవసరం లేదు" అన్నాడు.
"జి హుజూర్!" అని ఫోన్ పెట్టేశాను. అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయాను. అయితే నిన్నటి సంబంధం బావకు నచ్చలేదు? వరుడు ఆరడుగుల యెత్తు, అందగాడు కాకపోయినా, ఫర్వాలేదు. తెలుపు, నలుపుగాని రంగుతో ఆకర్షణీయంగానే ఉన్నాడు. అతను బ్యాంక్ లో పనిచేస్తున్నడట. తండ్రికి మెడికల్ షాపుంది. ఇద్దరే కొడుకులట. అదికాక శారదత్త కొడుకు అన్ని విధాల తగినవాడు, అనిల్ కుమార్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-"మాదిరెడ్డి సులోచన."