Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భర్తృహరి జీవించిన కాలం మనకు నిర్ధారణగా తెలియదు. క్రీస్తుశకం 7 లేదా 8వ శతాబ్దంలో జీవించి వుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈయన సుభాషిత త్రిశతి రచనకు తన జీవితానుభవాలను, జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని రాసి వుంటాడని భావించాలి. భర్తృహరి సంస్కృత సుభాషితాలను ముగురు తెనిగీకరించగా సాహితీలోకంలో ఆదరణ ఎక్కువగావున్న ఏనుగుల లక్ష్మణకవి పద్యాలకే భావం సమకూర్చి పాఠక లోకానికి అందిస్తున్నాం.
భర్తృహరి రాసిన సుభాషితాలలో నీతి పద్యాలను ఇదివరకే "భర్తృహరి నీతి పద్యాలు” పేరుతో అందించాం. కనుక ఇప్పుడు శృంగార, వైరాగ్య పద్యాలను మాత్రమే 100 + 100 భావంతో అందజేస్తున్నాం . నేటి యువతలో పెళ్ళి అయ్యాక భార్యతో ఎలా సంసారం చెయ్యాలో తెయనివాళ్ళు 5% మంది వున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య సాంగత్యం కుదరక విడాకులు తీసుకోవడం ఎక్కువవుతోంది. కనుక శృంగార జ్ఞానం కూడా నేటి యువతీ, యువకులకు అవసరమే.
భర్తృహరి మానవుల స్వభావాన్ని తన ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించారు. శృంగారమంటేనే బూతు అని అనుకోనక్కరలేదు. నేడు డాక్టర్లు మీరు ఎంత వయసు వారైన, మీ ధర్మపత్ని సహకరించినంతకాలం శృంగారంలో పాల్గొంటే ఇద్దరి ఆరోగ్యాలకు మంచిది అంటున్నారు. దీనర్థం బలవంతమూ, అధర్మమూ అయిన శృంగారానికి వెళ్ళమనికాదు.
మీరు శృంగార దశ దాటాక వైరాగ్య దశలో ఎలా వుండాలో భర్తృహరి తన పద్యాల ద్వారా వివరించారు. యవ్వనం దాటాక ఎలా పెద్దరికం వహించాలో, భక్తి, ముక్తి మార్గంవైపు ఎందుకు వెళ్ళాలో తెలిపే పద్యాలివి. పూనవాళికి తన సుభాషితాల ద్వారా మంచిని, మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చిన కవి భర్తృహరి. సుకవి జీవించు ప్రజల నాలుకలలోన అన్నారు జాషువాగారు. జాషువాగారన్నట్లు భర్తృహరి పడహారణాల అసలు సిసలైన సుకవి. అందుకే నేటికీ వారి పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి.
ఈ పద్యాలను యువతీ, యువకులు, వయోజనులు, రచయితలు తప్పక చదవాలని, తద్వారా వారు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న శృంగార సమస్యలను ఆ తదుపరి వయసులో వచ్చే వైరాగ్య సమస్యలను పరిష్కరించుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ.....
అభివందనలతో
పి.రాజేశ్వర రావు