Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన ''బారిష్టర్ పార్వతీశం''. ఇది హాస్య రచన. ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో నరసింహ శాస్త్రి ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండ్ వెళ్ళాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్ లో ఇంగ్లండ్ చేరేవరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఉత్తమ పురుష కధనంలో రకరకాల అనుభవాల్ని రచయత మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించాడు.
ఎప్పుడూ పట్టణాలు,నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన, వేషధారణ హస్యస్పోరకంగా ఉంటాయి.ఇందులో చాల విషయాలు ఇప్పటివారికి చాలా మాములుగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో అదొక వింత.