శ్రీమతి చిల్లర భవానీదేవి "బంగారు కల" అనే చారిత్రక నవల వ్రాసి నా వద్దకు తెచ్చి దినిపై అభిప్రాయము వ్రాసి ఇవ్వవలసిందిగా కోరినపుడు ఆనందం కలిగింది. ఎందుకంటే చారిత్రక నవలా ప్రక్రియ స్వాతంత్య్రానంతర యుగంలో గ్రీష్మతాపమునకు ఎండిన సెలయేరువలే సన్నగిల్లింది. అందుకు చాల కారణాలున్నాయి. చారిత్రక నవలా రచనకు పరిశోధనా పరిశ్రమ కావాలి. చదివే పాఠకులు కూడా టి.వి. సాంస్కృతికె నేడు జనం అలవాటుపడ్డారు. 1947 కు ముందు జాతీయ భావోద్దీపనతో ఆధారం లభించింది. అట్టిదశలో నవల వ్రాయటం, దానిని చదివింపజేయటం అంతకన్నా కష్టమైన పని. ఈ దశలో లబ్ద ప్రతిష్ఠితురాలైన భవానిదేవి కృష్ణదేవరాయల యుగానికి చెందిన నవల వ్రాయటం ముదావహం.
బంగారు కల అనగా సువర్ణస్వప్నం. సువర్ణము అనగా మంచి అక్షరము జాతిని ప్రభోదించెదే మంచి అక్షరమవుతుంది .తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్.