దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, సాధు పోషణలకై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోను అవతరిస్తూ ఉంటాడు. అట్టి అవతారాలలో శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారం. బాల్యదశలోనే పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైన దుర్మార్గులను చంపినాడు. కాళీయమర్దనం, గోవర్ధన పర్వతాన్నిఅవలీలగా పైకెత్తడం వంటి లీలలను బాలకృష్ణుడు గానే నిర్వహించాడు. ఈ బాలకృషుణుడే మహాభారత సూత్రధారియై, జగన్నాటక సూత్రధారియై ఆర్నునునకు తత్త్వవప్రబోధంచేసి గీతా కృష్ణుడుగా కూడా ప్రసిద్దికెక్కినాడు.
అటువంటి భగవద్గీతలోని అంశాలను బొమ్మలతో సహా అందించే ఈ మహత్తర గ్రంథ ప్రణాళిక పూజ్యశ్రీ శ్రీమాన్ జంపన శ్రీనివాస సోమరాజు గారి యొక్క సంకల్పం. భగవద్గీతలోని క్లిష్టమైన జ్ఞాన, భక్తి, వైరాగ్యాది , అంశాలను శ్రీ నీలి వెంకటరమణ గారి బొమ్మల చిత్రణతో సమ్మిళితం చేసి అందించడం వల్ల ఈ గ్రంధం చిన్న పిల్లలు సైతం చదివి ఆనందంతో ఉత్తేజం పొందదగినరీతిలో రూపురేఖలు దిద్దుకున్నది.