Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
జక్కేపల్లి జగ్గకవి 1925వ సంవత్సరంలో, గంటూరు జిల్లా కంభంపాడులో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేసిన జక్కేపల్లి జగ్గకవి రాసిన బాలకృష్ణ శతకం నేటి బాలల అభివృద్ధికి దిక్చూచి వంటిది.
చిన్న వయసులోనే బాలుడనే శిల్పాన్ని చక్కగా మలచాలి. పిల్లలకు మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేస్తే ఆ పిల్లవాడు పాఠశాలకు సక్రమంగా వెళ్లి మంచి చదువులు చదవగలడు. తన శారీరక ఎదుగుదలలో పాటు మానసిక ఆలోచనలను పెంచుకోగలుగుతాడు. అప్పుడే సమాజాన్ని బాగా అవగాహన చేసుకోగలుగుతాడు. జగ్గకవి 'కృష్ణ' అనే మకుటంతో బాలల శిక్షణకు ఉపయోగించే 106 కంద పద్యాలు గల శతకం రాశారు. పిల్లలు చదువుకోగలిగి అర్ధం చేసుకునే వ్యవహారిక భాషా తెలుగు శతకం బాలకృష్ణ శతకం.
పిల్లలే దేవుడు, దేవుడే పిల్లలుగా భావించటం చేత రచయిత 'కృష్ణా' అంటూ సంబోధన చేస్తూ రాశారు. పెద్దలు బాలలను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలి. చిన్నతనంలోనే మానసిక సంస్కారం అలవడేటట్లు చేయాలి. దానికై మంచి ఆహారపు అలవాట్లను, పరిశుభ్రతను, మనోనిగ్రహాన్ని, శాంతస్వభావాన్ని అలవాటు చేయాలి. జ్ఞానాన్వేషణ మార్గంలో తమ ఆలోచనలను పెంచుకొనేటట్లు చేయాలి.
వందకి పైగా చెప్పిన పద్యాలలో పిల్లలకు చదువుమీద ఇష్టం కలిగి బడికి వెళ్లేలా చేయటం, పాటల ద్వారా నీతులు తెలుసుకోవటం, క్రమ శిక్షణతో పెరగటం, పరిపూర్ణ వ్యక్తిత్వంతో వికసించటం జరుగుతుంది. బాలురను భావి పౌరులుగా తీర్చిదిద్దటానికి ఇలాంటి శతక పద్యాలు చదివించాలి. ప్రతి పాఠశాలలో బాలుర చేత ఈ శతకాన్ని వల్లె వేయించాలి.
బాలుర కరదీపిక బాలకృష్ణ శతకం!