Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹65

                        రూపక ప్రక్రియల్లో ఏకపాత్రాభినయం ఒక విశేషమైన ప్రక్రియ. ఒక నటుడు తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఒక్కొక్కపాత్ర ఒక్కొక్క రస ప్రధానంగా సాగుతుంది. కరుణ, బీభత్స, భయానక, వీర, భక్తి, క్రోధ, శాంతి, శృంగార రసాలతో నిండి నిబిడీకృతమై విలసిల్లేవి ఆయా ఏకపాత్రలు. -

                        పిల్లలకు మన భాషా సంస్కృతుల పట్ల గొప్ప అవగాహనను కథలు, గేయాలు, నాటకాలతో పాటు ఏకపాత్రల అభినయంవలన కూడా కలిగించవచ్చు. ఏకపాత్రల పఠనం వల్ల సాధనవల్ల జీవన నైపుణ్యాలను అలవర్చుకోగలుగుతారు. వినోద, విజ్ఞానాలతో పాటు చక్కని భాష, సంభాషణా చాతుర్యం, భావవ్యక్తీకరణ పెంపొందించుకోగలుగుతారు. పిల్లలకు పురాణ పురుషులు, చారిత్రక వీరులు, ఆదర్శనాయకుల పట్ల అవగాహన కలుగుతుంది. వారి జీవితాలనుండి పిల్లలు స్ఫూర్తి పొంది వ్యక్తిత్వవికాసంతో మహోన్నత స్థితిని అందుకోగలుగుతారు.

                        ఈ సంకలనం ప్రముఖ రచయితలు తీర్చిదిద్దిన పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక ఏకపాత్రలతో రూపొందించబడింది. వివిధ సందర్భాల్లో పాఠశాలల్లో విద్యార్థుల చేత ప్రదర్శింప చేయటానికి అనువైన ఏకపాత్రలకు వేదిక ఈ పుస్తకం.

ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగిన అమూల్యమైన పుస్తకం.