Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹54

                                    అనంతనామములుదాల్చిన జగద్రక్షకునకు ఇన్ని నామములని పరి మితిలేదు, ఈ మహాపురుషుని రూపముచిత్రాతిచిత్రమైనది. ఎముకులతో కూడిన హసిపంజరమునకు మూడుకోట్ల యేబదిలక్షల నాడులను అమర్చి ఏవిధముగను అనచో వెదురుడొంకకుగడలు ఆగడలకు కణుపులు కణుపు కణుపు నకు చిల్లలనే పలవలు ముండ్లు ఆకులు ఏవిధముగ కల్పిత మెనర్చబడి యుండునో అదే విధముగా మానవ దేహ నిర్మాణమును నిర్మించెను.

                                     ఈ కారణము చేతనే మానవజాతివంశవృక్షమునకు వెదురుడొంకకు సాటి చెప్పుచు నామముంచిరి "కురువంశము” అని పైన తెలిపిన రెండింటికి దగ్గరసంబంధము చెప్పినారు. ఇట్టి దుష్ఠవంశమునందు సజ్జనలు పొడమినచో గురువంశము” అనెడి నామధేయముంచిరి. పైన తెలిపిన నాడులు | సర్వాంశము వలన పుట్టించిన ఉపసర్పములు అగుట వలన మనుజులకు | ఆ సర్వగుణములే, అనగా అహంకారోద్రేకములు, కోపతాపములు కలవారై మనుజులు ఉందురు. “తనుంసర్పజాలం” అని నాడులను గూర్చి యోగ శాస్త్రము వచించినది. నాడులు కోట్ల సంఖ్యలో ఉన్నను గుణగ్రాహణములగు | నాడులే మిగుల శ్రేష్టమైనవి అని నాడిశాస్త్రజ్ఞులు చెప్పియున్నారు.

                                      పంచభూత ప్రపంచము, ప్రపంచము వలెనె పాంచభౌతిక మునుష్య దేహము అనేకలక్షల కోట్ల రేణువులతో సృజింపబడిన వగుట వలన ఈ | రెండిం టిని గూర్చి సంపూర్తిగా విషయ వివరణము ఇచ్చుటకు ఎన్ని శాస్త్రాధికములు చదివిన వారికైనను, వేదవేదాంగోపనిషత్తులను అభ్యసించిన వారి కైనను, సాధ్యమవ్వదు. పరిమితి లేని పదార్ధమును గూర్చి పరిమిత | శబ్దములతో విషయ మిద మిద్దనేమని... వక్కాణించుటకు ఏ వక్తా సరిపోడు.గుణ గ్రాహకనాడుల వలనే, ఉఛ్వాస నిశ్వాసములకు ఆధారభూత ములైన -- పింగలనాడులు, మోక్షనాడి అగుటవలన షుష్మనాడి ఉత్తమోత్తము మైననాడులని నాడీశాస్త్రము ధృవీకరించినది. 

                                      ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతి అనే పుస్తక రచనకు ఆధారముగా నేను గ్రహించిన ఇతి వృతము తెలిపెదను.