శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం జీవితంలో ఏమి సాధించాలన్న సాధించగల్గుతాము.
మన శరీరం గురించి మనకు కనీస అవగాహన ఉండటం అవసరము. అందుకే వైద్య రంగంలో విశేషమైన అనుభవం పరిశోధన అనుభవం కల్గిన ప్రముఖ వైద్యులు డా. టి. బిక్షపతిగారు జీవితంలో సాధారణంగా, వంశపారంపర్యంగా, జన్యుపరంగా వచ్చే వివిధ వ్యాధులు, వ్యాధులు లక్షణాల గురించి తెలియజేస్తూ వాటి నివారణకు సాధ్యమైనంత మనకు అందుబాటులో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు పుష్పాలు వగైరా మరియు మందు మొక్కలు వాటి పోషక విలువలు, వాటి మూలంగా లభించే ఔషధాల గురించి చాలా విపులంగా వ్రాసారు.
ఈ పుస్తకం ఆరోగ్యం కోరే వారికి, ఆయుర్వేదం పై అభిమానం, ఆసక్తి, అనురక్తి కల్గినవారందరికి ఆనంద దాయకంగానూ ఆమోదయోగ్యంగానూ వుండగలదనడంలో సందేహం లేదు. ప్రతి విషయమును అందరికి అర్థమయ్యేలా కూలంకషంగా అందచేసిన డా. బిక్షపతి గారు కృషి సర్వదా ప్రశంసనీయం మాకెంతో ఆనందదాయకం.
- డా. టి. బిక్షపతి