Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ద్వంద్వ ప్రవృత్తికి దర్పణం
ప్రసిద్ధ కన్నడ రచయిత యు. ఆర్. అనంతమూర్తి గురించి, ఆయన రచనల గురించి తెలుగు పాఠకులకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 'సంస్కార' లాంటి నవలకు తెలుగులో కనీసం రెండు మూడు అనువాదాలు వచ్చాయి. ఆ నవలతో తెలుగువారికి అత్యంత ఇష్టమైన కన్నడ రచయితలలో అనంతమూర్తిగారు ఒకరయ్యారు. అనంతమూర్తిగారి మరొక విశిష్టమైన నవల 'అవస్థ'ను తెలుగులో చదవబోతున్నారు. ఈ చిన్న పరిచయం ఆ నవల గురించి.
'అవస్థ' నవల చదువుతున్నప్పుడు నాలో ఎన్నో ప్రశ్నలు. అవన్నీ రచయితను అడగాలనిపించిన ప్రశ్నలు. ఈ నవల అనంతమూర్తిగారు ఎప్పుడు రాశారు? ఏ నేపథ్యం లో రాశారు? అని. ఎందుకంటే ఇది ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన కథ. అలా అన్నంత మాత్రాన నవలలో కేవలం పార్టీలు, రాజకీయాలు, ఆ గొడవలు మాత్రమే లేవు. నవలలో ప్రధాన పాత్రధారి కృష్ణప్ప గౌడ, మాజీ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు. కమ్యూనిస్టు ప్రజా నాయకుడు. కులపరంగా శూద్రుడు. అతని కులం నవలకు, నవలలో ప్రధానం కాబట్టే ప్రస్తావిస్తున్నాను.
50 ఏళ్ల కృష్ణప్ప గౌడ పక్షవాతంతో మంచం మీద పడుకొని ఉండటం తో కథ ప్రారంభమవుతుంది. నాగేశ అనే పార్టీ కార్యకర్త కృష్ణప్ప గౌడకు విరాభిమాని. కృష్ణప్ప గౌడ జీవిత చరిత్రను అతను రాస్తూ ఉంటాడు. నాగేశకు చెప్పటం కోసం కృష్ణప్ప గౌడ తన జీవితాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ