"తోవ పొడుగునా కన్నిళ్ళుంటాయి.
ఘర్షణలుంటాయి. వాటి స్పందనలే నా రచనలు."
2008 జనవరి లో ప్రారంభమైన అల్లం రాజయ్య సాహిత్య సర్వస్వo సంపుటాలను జూన్ 2019 లో వెలువరిస్తోన్న ఆఖరి ఆరవ సంపుటంలో ముగిస్తున్నం. రాజయ్య గారి రచనలకు వరవరరావు గారి సంపాదకత్వం సమగ్రతను సమకూర్చింది. రాజయ్యగారి రచనలకున్న రాజకీయ సామజిక సాంస్కృతిక నేపధ్యాలని బహుశా వరవరరావుగారి కన్నా విస్తృతంగా లోతుగా పరిశీలించటం మరొకరికి సాధ్యం కాదు. రాజయ్య, వరవరరావులు ఇద్దరూ కూడా నడుస్తోన్న ఈ కల్లోల నక్సల్బరీ దశాబ్దాలకు రాజకీయ, సాంస్కృతిక వ్యాఖ్యాతలు.
-రాజయ్య.