Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఈ అలజడి ఏమిటి? అక్షరరూపం ఎందుకు?
1999,
ఆ సంవత్సరం నా జీవితంలో చాలా తీవ్రమైన ప్రకంపనలే కలిగిం చింది. నాన్న చనిపోవడం, అప్రతిహతంగా టెలికం ట్రేడ్ యూనియన్లలో ముందుకు దూసుకుపోతున్న సమయంలో అకస్మాత్తుగా నన్ను నేను అన్ని రకాల బాహ్య కార్యాచరణల నుండి విరమించుకోవడం, ఇంటి విషయాలలో తీవ్రమైన ఆందోళనలకు గురికావడం, అదే సమయంలో న్యాయశాస్త్రంలో పిహెచ్.డి చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలో అవకాశం రావడం, నాకు తెలియకుండానే నేను నెమ్మదిగా ఒక రకమైన మానసిక రోగిగా మారడం, దీనికి నాలుగు సంవత్సరాలు వైద్యం తీసుకో ! వడం, అదే సమయంలో అంత ఒత్తిడిలోనూ పిహెచ్. డిని పూర్తిచేయడం, 2004కల్లా ఉద్యోగం వదిలేయడం, న్యాయవాద వృత్తిలోకి వచ్చేయడం.... మరి ఇవన్నీ కాన్షియస్ నిర్ణయాలేనా?
సంక్షోభాల నుండి బయటపడుతూ, కొత్త సంక్షోభాలలోకి వెళ్లిపోతూ, పడుతూ లేస్తూ, చదువుతూ, వ్రాస్తూ, మాట్లాడుతూ, విసుక్కుంటూ " 2015-16దాకా జీవితం సుడిగుండంలా వుండింది. తిరిగి కొంత స్థల వస్తోన్న సమయంలో గతాన్ని విశ్లేషించడం, అక్షరరూపంలో.............