Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                     వస్తువు తజన్యమైన ఇతివృత్తమూ, రచన తదనుకూలమైన భాష, సన్నివేశ పాత్ర ప్రవర్తనాదులూ, ఆసక్తి కలిగించే ఈ లక్షణాలు శ్రీ నక్షత్రం వేణుగోపాల్ కథానికలు సంపుటి 'అరుగు' లో ప్రత్యక్షమై, పాఠకులు పరమానందం పొందుతారు. కథానికల్లో పరిచిత విషయం ప్రత్యక్షమయితే, పునశ్చరణతో చదువరులు ఉత్తేజితులౌతారు. అపరిచితాంశాలు ఆవిష్కృతమైతే, ఆశ్చర్యానుభూతులకు సహృదయులు లోనవుతారు. -

                      తెలుగు పాఠకులు తెలుగు భాషలో ఇంతకు పూర్వం అంతగా పరిచయం లేని విశేష జీవితం చెప్పే ట్రూ ఫేస్ అమెరికా కథలు, శ్రీ వేణు చెబుతుంటే విని చదివి, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు, అర్థం చేసుకుంటారు. శ్రీ నక్షత్రం వేణుగోపాలకు కథా నిర్వహణ ఆసక్తికరంగా చేయడం బాగా పట్టుబడింది. పాత్ర సృష్టి, సన్నివేశ కల్పన, అతిశయోక్తులు లేకుండా సుందరంగా సహజంగా రాయడం తెలిసి వచ్చింది. ఈ కథానికలు సహజత, స్పష్టత, ఆర్జవం, సౌకుమార్యం సాధించుకున్న మంచి రచనలు. ఉత్తమ కథానికా మార్గంలో మునుముందుకు సాగుతున్న శ్రీ నక్షత్రం వేణుగోపాల్ ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాడని పాఠకులు నమ్ముతారు.

                                                                                                                                                                                                                                                                                 -కొలకలూరి ఇనాక్

                       సరిగ్గా ఏడాది క్రితం వేణు నక్షత్రం నాకు ఫోన్ చేసి మూడు దశాబ్దాల క్రితపు మంజీరా రచయితల సంఘ సమావేశాల్లో కలిసిన జ్ఞాపకాలను తడుముతూ తనను పరిచయం చేసుకొన్నారు. మంజీరా రచయితల సంఘంతో కలిసిన అనుభవాలు ఎవరికైనా సంతోషకరమైనవే. దిశానిర్దేశం చేస్తూ తెలంగాణాలో రచయితలను తయారుచేసిన, నడిపించిన చరిత్ర ఆ సంస్థది. అలాంటి సంస్థతో సంబంధంవల్ల 90ల నాటికే రచనా రంగంలోకి ప్రవేశించిన వేణు నాకిప్పుడు ఇలా పరిచయం అయ్యారు. ముందుగా ఆయన పేరులోని నక్షత్రం నన్ను బాగా ఆకర్షించింది. ఆకాశంలోని, అనంతకోటి నక్షత్రాలలో ఒకటి ఎంత చక్కగా ఆయన పేరుకు ముందు పుట్టుకతోనే చేరిపోయిందికదా అనుకున్నా, కథలు రాయటం, లఘుచిత్రాలు తీయటం, నటించటం వంటి అభిరుచులు ప్రయత్నపూర్వకంగా ఆయన ఎన్ని నక్షత్రాలను కలగంటే, ఎన్ని నక్షత్రాలను ఆవాహన చేస్తే సాధ్యమైంది! ?

                        మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే నక్షత్రం వేణుగోపాల్ కథలు చదవటం మంచి అనుభవం. జీవితాన్ని ఆవరించుకొన్న కనిపించని భీభత్సాన్ని కనిపింపచేయటం ఆయన కథల లక్ష్యం, సంపదలు, సంపాదనల యావలో మనిషి మాయం కావటం పట్ల ఆయన వేదన, వ్యష్టి నుండి సమిష్టి ఆయన కామన,

                                                                                                                                                                                                                                                                        - కాత్యాయిని విద్మహే