ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి, పొట్టకూటికై సోదరుని కూడి దేశ దేశాలు తిరిగి, విస్తరాకులు కుట్టి, దానితోనూ పొట్ట నిండక, పరుపుగా బ్రతకాలనే కోరికతో, అనేక రాజ్యాలలో అనేక కొలువులు చేసి, చివరకు సామంత రాజైనటువంటి తుళువ నరసరాయలు వద్ద మంత్రిగా చేరి ఆయనను తన అపూర్వ ప్రతిభారాజ నీతిజ్ఞతో సార్వభౌముని చేసి, ఆ తర్వాత కాలంలో విజయనగరాన్ని ఏలిన శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్య వ్యాప్తికి విశేషంగా కృషి చేసి సార్వభౌముని సైతం నీవని పిలువగలిగి - సామ్రాట్ చే అప్పాజీని పిలువబడిన వ్యక్తి మహామంత్రి తిమ్మరుసు. అటువంటి తిమ్మరుసు గాధే ఈ చారిత్రక నవల.
- ప్రసాద్