Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న సూత్రం మనమందరమూ పదే పదే చెపూవుంటాం. ఆ ప్రజలకోసమే అంకితభావంతో పనిచేస్తున్నవారు ఎందరో మనలో ఉన్నారు. ఐతే, మన లక్ష్యానికి, మనం పని చేస్తున్న తీరుకి పొంతన ఉన్నదా? నిరంతరమూ ఉద్యమ నిర్మాణంలోనే నిమగ్నమై పని చేస్తున్నా, ఆశించిన మార్పు, ఉద్యమంలో పురోగతి ఎందుకు రావడం లేదు? ఏ ప్రజలకోసమైతే పని చేస్తున్నామో, ఆ ప్రజలతో మన సంబంధాలు ఆశించిన రీతిలో ఎందుకు బలంగా ఉండడం లేదు? మన పనిలో యాంత్రికత ఎందుకు చోటు చేసుకుంటున్నది? ఇత్యాది ప్రశ్నలు మనలను వెంటాడుతున్నాయి. బహుశా ఈ నవలలో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే దొరకవచ్చు.
ఒకానొక సామాజిక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని చేరుకోవాలని కృషి చేసే ప్రతీ సామాజిక కార్యకర్తా, ప్రతీ ఉద్యమకారుడూ తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం ఇది.