మొత్తంగా మన రాష్ట్రంలో దళిత ఉద్యమం సాహిత్యంలో వ్యక్తీకరింపబడినంత ఉన్నతంగా, స్వతంత్రంగా రాజకీయ, ఆర్ధిక , సామజిక రంగాలలో లేకపోవడం ఒక నిరాశజనక పరిణామం. ఆ లోటును పూడుస్తూ వర్తమానంలో నిరంతరం దళితులు ఎదుర్కొంటున్న దారుణమైన ఆర్ధిక దోపిడీని వివరించే పరిశోధనాత్మక కథనమిది.
దళితుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు నిధులను సబ్ ప్లాన్ పేరుతో ఖర్చుచేస్తున్నామని చెప్పుకొనే ప్రభుత్వాలు ఆచరణలో నిర్లక్ష్యంగా, నికృష్టంగా, దారుణాతిదారుణంగా ఆ కోట్లాది రూపాయలను తమ సొంత ప్రయోజనాల కోసం నగ్నంగా బహిరంగంగా దారిమళ్ళిస్తూ తమ వ్యక్తిగత / పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు.